వనస్థలిపురం బ్యాంక్‌ చోరీ కేసులో కొత్త కోణం.. బ్యాంక్ చోరీకి కారణం క్రికెట్ బెట్టింగ్

Hyderabad: బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానని మేనేజర్‌కు క్యాషియర్ మెసేజ్

Rama Rao
Published on: 12 May 2022 12:55 PM IST
Vanasthalipuram Bank Cashier Escape Case | Telugu News
X

వనస్థలిపురం బ్యాంక్‌ చోరీ కేసులో కొత్త కోణం

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురం బ్యాంక్‌ చోరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. క్రికేట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణంగా తెలుస్తోంది. బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానని బ్యాంక్ మేనేజర్‌కు క్యాషియర్ ప్రవీణ్ మెస్సేజ్ చేసినట్లు సమాచారం. బెట్టింగ్‌లో డబ్బులు వస్తే తిరిగి ఇస్తాను.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం బ్యాంక్‌లో ఉన్న 22 లక్షలకు పైగా నగదుతో క్యాషియర్ ప్రవీణ్ పరారయ్యాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్ ప్రవీణ్ కోసం మూడు ప్రత్యేక టీమ్‌లు గాలిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story