ఉద్యోగాల పేరుతో యువతులను మోసం చేస్తున్న కేటుగాడు అరెస్టు.. ఇప్పటికే 5 కోట్లు వసూలు...

Fraud Arrest: సంపాదించిన డబ్బులను బెట్టింగ్, గుర్రం పందాలతో జల్సాలు...

Shireesha
Updated on: 9 May 2022 5:50 PM IST
Vamsi Krishna Cheated Single Womens with Job Offer and Earned 5 Crore by Fraud Them | Live News
X

ఉద్యోగాల పేరుతో యువతులను మోసం చేస్తున్న కేటుగాడు అరెస్టు.. ఇప్పటికే 5 కోట్లు వసూలు...

Fraud Arrest: ఉద్యోగాల పేరుతో యువతులను మోసంచేస్తున్న కేటుగాడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆటకట్టించారు. ఏపీ, తెలంగాణల్లో యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని 5 కోట్లమేర వసూలు చేసినట్లు సమాచారం. వంశీకృష్ణపై రెండు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వంశీకృష్ణను అరెస్టుచేశారు.

ఆన్‌లైన్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే టార్గెట్ గా ఎంచుకుని మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన డబ్బులతో బెట్టింగ్, గుర్రంపందాలతో జల్సాలకు అలవాటుపడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. విచారిస్తే... ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story