వ‌చ్చే ఎన్నిక‌లే నా చివ‌రి ఎన్నిక‌లు.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికలే తన చివరి ఎన్నికలు కావొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 19 May 2022 9:30 PM IST
Uttam Kumar Reddy Slams CM KCR
X

వ‌చ్చే ఎన్నిక‌లే నా చివ‌రి ఎన్నిక‌లు.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికలే తన చివరి ఎన్నికలు కావొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. రాజకీయాలు మొత్తం కరప్షన్‌గా మారిపోయాయని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసిన డబ్బు ప్రభావమే కనిపిస్తుందని ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. అందుకే తనకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు కావచ్చని తెలిపారు.

ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌లో భరోసా నింపేందుకునెల 21 నుండి నియోజకవర్గాల్లో రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాని ఉత్తమ్ తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్ల సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యంగా మారిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ బాగా ఇబ్బందుల్లో ఉందన్నారు ఉత్తమ్. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story