మందకొడిగానే గ్రేటర్ ఎలక్షన్ పోలింగ్ : ఉదయం 11 గంటల వరకు 10 శాతం లోపు పోలింగ్

X
Highlights
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓ వైపు సమయం దగ్గరపడుతున్నా ఓటేసేందుకు జనం ఆసక్తి చూపటం...
Arun Chilukuri1 Dec 2020 7:05 AM GMT
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓ వైపు సమయం దగ్గరపడుతున్నా ఓటేసేందుకు జనం ఆసక్తి చూపటం లేదు. ఉదయం 11 గంటల వరకు 10 శాతం పోలింగ్ కూడా నమోదు కాని పరిస్థితి ఉంది హైదరాబాద్‌లో. దీంతో ఈసారి గతంలో పోలైన ఓట్లు అయినా పడతాయా లేదా అనే సందేహం నెలకొంది.
ఓ వైపు సెలబ్రిటీలు ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నా సాధారణ పబ్లిక్ మాత్రం పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ఇక లాక్‌డౌన్ నుంచి దాదాపు టెకీలంతా నగరాన్ని విడిచి వెళ్లటంతో కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని అధికారులు భావిస్తున్నారు.
పోలింగ్‌లో ఇప్పటివరకు గాజులరామారం, ఉప్పల్ సర్కిల్ చాలా వెనకబడి ఉన్నాయి. అక్కడ ఉదయం 11 గంటల వరకు రెండు శాతం పోలింగ్ కూడా నమోదవలేదు. ఇక కొన్ని చోట్ల పోలింగ్ బూత్‌లు ఓటర్లు లేక నిర్మానుష్యంగా మారాయి. బయట ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
Web TitleUp to 11 Am, only 8.90 percent of polling was registered In the GHMC elections 2020
Next Story