Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..

Kishan Reddy: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 Feb 2023 10:54 AM IST
Union Minister Kishan Reddy Nephew Died Due To Heart Attack
X

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..

Kishan Reddy: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి(47) గుండెపోటుతో కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌ వినయ్‌నగర్‌లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి. జీవన్‌రెడ్డి తన నివాసంలో నిన్న ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. నోయిడాలో ఉన్న కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు. జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story