జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్
x
Highlights

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌పై సీరియస్‌ అయ్యారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు....

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌పై సీరియస్‌ అయ్యారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. తన పర్యటనలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ పాల్గొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌కు ఫోన్‌ చేసిన కిషన్‌రెడ్డి కనీసం డీఈ, ఏఈ స్థాయి అధికారులనైనా పంపించకపోవడం సమంజసం కాదని అన్నారు.

అనంతరం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అనంతరం హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో ఫోన్‌లో మాట్లాడిన కిషన్‌రెడ్డి వరద బాధిత ప్రజలకు నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేయాలని చెప్పారు. మరోవైపు తమను పట్టించుకోవడంలేదంటూ కేంద్రమంత్రి ముందే అధికారులను నిలదీశారు ప్రజలు.

Show Full Article
Print Article
Next Story
More Stories