ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
x
Highlights

హైదరాబాద్ బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి భవన నిర్మాణ...

హైదరాబాద్ బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను సమీక్షించిన ఆయన రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఆయన ఆస్పత్రిని సందర్శించానని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా చూస్తామని చెప్పారు.

ప్రధాని నరేంద్రమోది అధికారంలోకి వచ్చిన తరువాత ఎయిమ్స్ ను అభివృద్ధి చేసామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎయిమ్స్ కోసం కేంద్రం రూ .1000 కోట్లు కేటాయించిందని, ఆపై ఎయిమ్స్ నిర్మాణానికి భూమి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తరువాత భవనాలను అధికారికంగా ఎయిమ్స్‌కు బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిన తరువాత అందులో సుమారు 750 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించవచ్చని, ఒక నెలలో అవుట్-పేషెంట్ బ్లాక్ తిరిగి ప్రారంభించబడుతుందని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలో బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories