డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Sumitra
Published on: 5 Oct 2020 4:45 PM IST
డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లక్ష్మణ్ తో కలసి ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతోన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను ఆయన ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ నిర్మాణంపై లబ్ధిదారులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. 2015 లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవటం ప్రభుత్వ చేతకాని తనం ఆయన ఎద్దేవా చేసారు.

ఎన్నికల‌ కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ళను వాడుకుంటోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని ఆయన అన్నారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్లో 7లక్షల ఇండ్లు పూర్తి చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో దాదాపు 20లక్షల మందికి పేదలకు ఇండ్లు లేవని ఆయన విచారం వ్యక్తం చేసారు. అందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేసారు. డబుల్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన కోరారు.

Sumitra

Sumitra

Next Story