Ujjaini Mahankali Bonalu: బోనాల నేపథ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు..

Ujjaini Mahankali Bonalu: Check Traffic Diversions In Secunderabad Area
x

Ujjaini Mahankali: బోనాల నేపథ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు..

Highlights

Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా..

Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ట్రాఫిక్ ను డైవర్షన్స్ చేశారు. ఆలయానికి 2 కి.మీ దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా...

కర్బల మైదాన్‌ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్‌ చౌరస్తా నుంచి మినిష్టర్‌ రోడ్‌ మీదుగా, ఎస్పీ రోడ్‌లోని బేగంపేట హెచ్‌పీఎస్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్‌ జాన్సన్‌ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి.

► సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్‌ హోటల్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాలి.

► సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి తాడ్‌బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్‌ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్‌ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

► బైబిల్‌ హౌస్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ గాస్మండి చౌరస్తా, సజ్జన్‌లాల్‌ స్ట్రీట్, రాణిగంజ్‌ మీదుగా వెళ్లాలి.

► ప్యాట్నీ ఎస్‌బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్‌ బండ్‌ వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్‌ రోడ్, ప్యారడైజ్‌ లేదా క్లాక్‌ టవర్‌ సంగీత్‌ చౌరస్తా, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి.

► ప్యారడైజ్‌ వైపు నుంచి బైబిల్‌ హౌస్‌ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్‌బీఐ, క్లాక్‌టవర్‌ మీదుగా వెళ్లాలి.

► క్లాక్‌ టవర్‌ నుంచి ఆర్పీరోడ్‌ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్‌ రోడ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

► సీటీవో, ప్యారడైజ్‌ నుంచి ఎంజీరోడ్‌ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్‌ రోడ్, కర్బల మైదాన్‌గా వెళ్లాలి.

► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్‌ జంక్షన్, ఐమాక్స్‌ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్‌ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

► సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్‌ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్‌ హౌస్, కర్బల మైదాన్‌ మీదుగా వెళ్లాలి.

► ఉప్పల్‌ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌ రోడ్డును వినియోగించుకోవాలి.

► సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి క్లాక్‌ టవర్‌ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు.

► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్‌స్ట్రీట్, సుభాష్‌రోడ్‌లో బాటా నుంచి రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ వరకు, ఆదయ్యనగర్‌ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories