మరో వారంలో పెళ్లి... అంతలోనే విషాదం

మరో వారంలో పెళ్లి... అంతలోనే విషాదం
x
Highlights

మరో వారం రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి సుముహూర్తం దగ్గర పడడంతో పనులన్నీ చకచక జరుగుతున్నాయి. ఓ వైపు బంధువులు రాక, పిండివంటల...

మరో వారం రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి సుముహూర్తం దగ్గర పడడంతో పనులన్నీ చకచక జరుగుతున్నాయి. ఓ వైపు బంధువులు రాక, పిండివంటల తయారి, షాపింగ్ లు ఇలా అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతే కాదు పెళ్లికి కావాల్సిన డబ్బును కూడా సర్దేశారు. ఇంతలోనే ఆ పెళ్లింట ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వర్షం రూపంలో వచ్చిన మృత్యువు పెళ్లి కూతురుతో సహా ఆమె వదినని కూడా కబలించింది. పెళ్లి కోసం యువతి కన్న కోటి ఆశల్ని కూల్చివేసింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే పాతబస్తీ హుస్సేనీఆలం ఠాణా పరిధిలోని మూసాబౌలిలో ఈ విషాదసంఘటన చోటు చేసుకుంది. నగరంలోని సుమారు 80 ఏళ్ల నాటి జీ+1 భవనంలో హాజీ మహ్మద్‌ఖాన్‌(54) కుటుంబం నివాసముంటోంది. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు భవనం పూర్తిగా నానింది. ఆ క్రమంలోనే ఆదివారం ఉదయం 11.30కు ఇంట్లో మట్టి పెళ్లలు కూలడం మొదలయింది. అయితే కుటుంబ సభ్యులు కూలుతున్న పైకప్పును పరిశీలిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విషాదసంఘటనలో హాజీ మహ్మద్‌ఖాన్‌తో పాటు ఆయన భార్య, కొడుకు కోడలు, కూతురు మనవళ్లు అంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో కోడలు, కూతురు మృతిచెందగా మిగిలిన వారు గాయాలపాలయ్యారు.

ఇక పోతే హుస్సేనీఆలంకు చెందిన యువకుడితో అనీస్‌బేగానికి ఏడు నెలల కిందటే నిశ్చితార్థం జరిగింది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఈ నెల 19న వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో విషాదం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories