టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు

ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్–2020 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు...
ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్–2020 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియలు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదలు కాగా, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (ఈనెల 12న) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇటు కాలేజీలకు యూనివర్సిటీ అఫిలియేషన్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అను మతి రాకపోవడంతో అధికారులు కౌన్సెలింగ్ తేదీల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. ఈనెల 18వ తేదీ నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకునేలా వెబ్‌సైట్‌లో అధికారులు మార్పులు చేశారు. 18వ తేదీన మొదలుకానున్న వెబ్ ఆప్షన్లు ఈనెల 22వరకు ఇచ్చేలా వీలు కల్పించారు. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లు ఫ్రీజ్ కావడంతో ఈనెల 24న సీట్ల అలాట్‌మెంట్ పూర్తవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ వరకు కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు.
ఇక పోతే రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లో 1,10,873 సీట్లున్నాయి. ప్రతి ఒక్క కళాశాల యాజమాన్యం ఏటా యూనివర్సిటీ అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ అఫిలియేషన్ ప్రక్రియ మే నెలాఖరు నాటికే పూర్తవుతుండటంతో ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీల పేర్లు కనిపిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాలేజీలే కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అఫిలియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కోర్సులు, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతో వారం పాటు ఆప్షన్‌ల నమోదను వారం పాటు వాయిదా వేశారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT