తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

Two More Days of Rain in Telangana
x

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

Highlights

Rain Alert: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే చాన్స్‌..

Rain Alert: రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. ఇవాళ ఉదయం భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్లు కురిసే అవకాశం ఉండగా, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories