Hyderabad News Today: హైదరాబాద్‌ అనాజ్‌పూర్‌లో దారుణం

Hyderabad News Today: ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కలకలం

Sandeep Eggoju
Published on: 18 Jun 2021 1:15 PM IST
Two Months Old Baby Dead Body Founded in Water Tank at Anajpur Hyderabad
X

ట్యాంక్లో పది మరణించిన 2 నెలల బాబు (ఫైల్ ఇమేజ్)

Hyderabad News Today: హైదరాబాద్‌ అనాజ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో రెండు నెలల బాలుడి మృతదేహం కలకలం రేపుతోంది. ఉదయం నుంచి బాలుడు కనిపించకపోవడంతో గ్రామమంతా జల్లెడ పట్టారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటిపై ఉన్న వాటర్‌ ట్యాంకులో చూడగా.. బాలుడి మృతదేహం నీటిపై తేలియాడుతోంది. హుటాహుటిన బయటకు తీశారు.

బాలుడు తనంతట తాను నీటి ట్యాంకులో పడే ఛాన్స్‌ లేదని, ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. నిన్న సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలే బాలుడి హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో.. బాలుడి అత్త, మేనమామలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story