Darbhanga Blast: బీహార్‌ దర్భంగా రైల్వే స్టేషన్‌లో పేలుడు

Two Hyderabad People Held for Links with Bihar Darbhanga Blast
x

Representational Image

Highlights

Darbhanga Blast: హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో ఉంటూ బీహార్‌లో పేలుళ్లకు ప్లాన్

Darbhanga Blast: బీహార్‌లోని దర్భంగాలో పేలుళ్లకు హైదరాబాద్ నుంచే కుట్ర పన్నినట్టు ఎన్‌ఐఎ గుర్తించింది. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో ఉంటూ బీహార్‌లో పేలుళ్లకు ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఆసిఫ్‌నగర్‌లో ఉంటూ పేలుళ్లకు స్కెచ్ వేశారు యూపీకి చెందిన ఇమ్రాన్, నాసిర్. వీరు ఆసిఫ్‌నగర్‌లో బట్టల షాపు నడుపుతున్నారు. చీరల మధ్య ఓ బాటిల్‌ను అమర్చి పార్శిల్‌ పంపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌‌లోని సీసీ కెమెరాల్లో నిందితుల దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌, నాసిర్‌లను అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తరలించారు ఎన్‌ఐఏ అధికారులు. ఇండియన్ ముజాహిద్దీన్‌తో సంబంధాలు, కాల్‌ రికార్డ్‌లను పరిశీలిస్తున్నారు అధికారులు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్ అనే వ్యక్తులు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్, నాసిర్ బట్టల దుకాణం నడుపుతున్నారు. కొన్ని చీరల మధ్య ఒక బాటిల్‌ను అమర్చారు. జూన్ 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దర్భంగాకు పార్సిల్ వెళ్లింది. జూన్ 17న దర్భంగా రైల్వే స్టేషన్‌లో ఈ సీసా పేలింది. ఈ పేలుళ్లలో ఎవరు గాయపడలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌లో సిసి టివి దృశ్యాలు రికార్డయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories