RTC Conductor: మద్యం మత్తులో మహిళ కండక్టర్ తో అసభ్య ప్రవర్తన..ఇద్దరిపై కేసు

RTC Conductor: మద్యం మత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది

Dhivi
Updated on: 7 Feb 2025 9:10 AM IST
RTC Conductor
X

RTC Conductor: మద్యం మత్తులో మహిళ కండక్టర్ తో అసభ్య ప్రవర్తన..ఇద్దరిపై కేసు

RTC Conductor: మద్యం మత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది. కరీంనగర్ జిల్లా మంథని వైపు నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9గంటలకు తెంలగాణ చౌరస్తా, సెంటినరి కాలనీకి చేరింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును ర్యాష్ గా నడుపుకుంటూ వచ్చి బస్సుకు అడ్డంగా పెట్టారు. కారును పక్కకు తీయాలని బస్సు డ్రైవర్ అడగడంతో అతనితో వాగ్వాదానికి దిగారు. అడ్డుగా వెళ్లిన కండక్టర్ పై దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి దిగారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు.

ఆర్టీసీ మహిళా కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు కమాన్పుర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్యలపై కేసు ఫైల్ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ చంద్ర కుమార్ మాట్లాడుతూ..ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే ఎంతగటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Dhivi

Dhivi

Next Story