Sangareddy: మెడికో రచనారెడ్డి మృతి కేసులో ట్విస్ట్..

Sangareddy: రచనా కారులో కొన్ని ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నాం

Shekhar G
Updated on: 13 Feb 2024 1:45 PM IST
Sangareddy: మెడికో రచనారెడ్డి మృతి కేసులో ట్విస్ట్..
X

Sangareddy: మెడికో రచనారెడ్డి మృతి కేసులో ట్విస్ట్..

Sangareddy: పీజీ వైద్య విద్యార్థిని రచనారెడ్డి ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మెడికో రచనా రెడ్డి మృతి కేసులో కీలక విషయం వెల్లడైంది. నిశ్చితార్థం జరిగిన యువకుడితో మనస్పర్థల కారణంగానే ఆమె బలవనర్మణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాణాంతక ఇంజక్షన్‌ తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నివాసముండే 26ఏళ్ల డాక్టర్‌ రచనారెడ్డి.. బాచుపల్లి మమత వైద్య కళాశాలలో పీజీ గైనకాలజీ ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. రోజూ ఆమె కాలేజీకి కారులో వెళ్లి వచ్చేది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రచనా ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు పక్కకి నిలిపి... డ్రైవింగ్‌ సీట్లోనే ఇంజక్షన్‌ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కిష్టారెడ్డిపేట గ్రామ శివారులోని ఔటర్‌రింగ్‌ రోడ్డుపై కారులో ఓ యువతి అపస్మారక స్థితిలో ఉందని అమీన్‌పూర్‌ పోలీసులకు సమాచారం అందింది.

Shekhar G

Shekhar G

Next Story