Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్

ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కనిపించని మత్తు మందు ఆనవాళ్లు..?

Sandeep Eggoju
Updated on: 18 Aug 2021 6:26 PM IST
Twist in Hyderabad Gandhi Hospital Incident
X

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఘటనలో మరో ట్విస్ట్ (ఫైల్ ఇమేజ్)

Gandhi Hospital: హైదారబాద్ గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లో మత్తు మందు ప్రయోగించినట్లు ఆనవాళ్లు కనిపించలేదని తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితులు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. అయితే వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతర ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ అందినట్లు సమాచారం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story