నేనెప్పుడూ మీ తమ్ముడినే పవన్ అన్నా.. పవర్ స్టార్ తో కేటీఆర్!

K V D Varma
Published on: 26 March 2020 10:48 PM IST
నేనెప్పుడూ మీ తమ్ముడినే పవన్ అన్నా.. పవర్ స్టార్ తో కేటీఆర్!
X
Pawan kalyan with KTR (file image)

పవర్ స్టార్ పవన్ కళ్యాన్.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్న అభిమాన గణం లేక్కలేనిది. జనసేనానిగా అయన రాజకీయ ప్రస్థానమూ చెప్పుకోదగినదే. ఇక ఇటు కేటీఅర్.. తెలంగాణా రాజకీయాల్లో మనసున్న వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందిన నాయకుడు. మంత్రిగా అయన చేసే సేవల కన్నా.. కష్టంలో ఉన్నానని ఎవరన్న చెబితే అయన స్పందించే తీరుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదంతా ఎందుకంటే.. ఒక్కోసారి ఇద్దరు ప్రముఖుల మధ్య నడిచే సంభాషణలు ఆసక్తి కరంగా అంతకు మించి వారిద్దరి అభిమానులను ఆహ్లాదపరిచేలా సాగుతాయి. ఇదిగో సరిగ్గా అటువంటిదే ఇప్పుడు కేటీఅర్ - పవన్ కళ్యాన్ మధ్య చోటు చేసుకుంది.

కరోనా దెబ్బకు ప్రపంచం అతలా కుతలం అయిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆసరాగా ఉండడం కోసం ప్రముఖులు అందరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణా రాష్ట్రానికి కోటి రూపాయల భారీ విరాళాన్ని గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అయన తెలంగాణా మంత్రి కేటీఅర్ కు ట్వీట్ చేశారు.

'''ధన్యవాదాలు కేటీఆర్ సర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మీరు అద్భుతంగా పని చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవలకు శుభాకాంక్షలు తెలుపుతున్నా'' అంటూ పవర్ స్టార్ కేటీఅర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

దానికి కేటీఅర్ ఆసక్తి కరంగా స్పందించారు. ''ధన్యవాదాలు అన్నా. కానీ, ఎప్పటి నుంచి మీరు నన్ను సర్ అని సంబోధిస్తున్నారు? నేను ఎప్పటికీ మీ బ్రదర్‌నే'' అంటూ జవాబిచ్చారు. ఇప్పుడు ఈ రెండు ట్వీట్లూ అభిమానుల్లో సందడి చేస్తున్నాయి.

ఇక కేటీఅర్ ట్వీట్ కు పవన్ కళ్యాణ్ ఎస్ బ్రదర్ అంటూ నవ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశారు. మొత్తమ్మీద కరోనా సహాయం మధ్యలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది.

K V D Varma

K V D Varma

Next Story