Tummala Nageswara Rao: రైతులకు ఉపయోగ పడుతున్న కిసాన్ ఎక్స్‌పో

Tummala Nageswara Rao Says Higher Yields Through New Agricultural Practices
x

Tummala Nageswara Rao: రైతులకు ఉపయోగ పడుతున్న కిసాన్ ఎక్స్‌పో

Highlights

Tummala Nageswara Rao: మొక్కల పెంపకంలో తీసుకున్న పద్ధతులను వివరించిన ఎండీ, ఈడీ

Tummala Nageswara Rao: నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి కిసాన్ ఎక్స్‌పో ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా కిసాన్ - 2024 ప్రదర్శన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రదర్శనను తిలకించారు. ఈ ప్రదర్శనలో వ్యవసాయ రంగంతోపాటు వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నారు.

ఇందులో భాగంగ కపిల్ ఆగ్రో ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విభిన్న రకాల పండ్ల మొక్కలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా కపిల్ ఆగ్రో ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పూర్ణచందర్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. తమ సంస్థ తరఫున పలు రకాల మొక్కలను ఈ ఎక్స్‌పో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. మొక్కల పెంపకంపై తీసుకుంటున్న పద్ధతులను వారు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories