సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు

X
Highlights
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి ప్రత్యేక...
Arun Chilukuri2 Jan 2021 3:30 PM GMT
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఏపీలోని వివిధ ప్రాంతాలకు 4వేల 980 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషస్, సెంట్రల్ బస్‌స్టేషన్, ఉప్పల్ క్రాస్ రోడ్‌తో పాటు నగరశివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని చెప్పారు. జంట నగరాల పరిధిలోని శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వివరించారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు వివరించారు.
Web TitleTSRTC to operate 4,980 special buses for Sankranti
Next Story