కొత్త సంవత్సరంలో షాక్ ఇవ్వబోతున్న టీఎస్ఆర్టీసీ

TSRTC bus fares hike proposal
x
తెలంగాణా ఆర్టీసీ బస్సులు (ప్రతీకాత్మక చిత్రం)
Highlights

మరోసారి తెలంగాణా ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్ ఇవ్వబోతోంది. సంవత్సరం క్రితం చార్జీలు పెంచిన ఆర్టీసీ మళ్ళీ చార్జీలు పెంచాలంటూ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి...

మరోసారి తెలంగాణా ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్ ఇవ్వబోతోంది. సంవత్సరం క్రితం చార్జీలు పెంచిన ఆర్టీసీ మళ్ళీ చార్జీలు పెంచాలంటూ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉంచినట్లు తెలుస్తోంది. డీజిల్ ధరలు విపరీతంగా ధరలు పెరగడంతొ పాటు, లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో చార్జీల పెంపు తప్పదని అధికారులు సీఎం కేసీఆర్ కు నివేదిన్చినట్టు తెలుస్తోంది.

మఖ్యమంత్రి కేసీఆర్ తొ గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఆర్టీసీ చార్జీల పెంపు అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చార్జీల పెంపు అనివార్యంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టు చెబుతున్నారు. ఇక ఆర్టీసీ సిబ్బందికి జీతాలు పెంచనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఆర్టీసీ ఖర్చుల్లో 52 శాతం వరకూ జీతభత్యాలే ఆక్రమిస్తున్నాయి. ఏ సంస్థకైనా సిబ్బంది పై చేసే వ్యయం 50 శాతం దాటితే మనుగడ ఇబ్బంది కరంగా మారుతుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఆ భారం 50 శాతానికి మించడం..మళ్ళీ జీతాలు పెంచితే అది మరింత పెరిగే అవకాశం ఉండటంతొ చార్జీల పెంపు అనివార్యంగా మారింది. ఆదాయాన్ని పెంచుకోవడం ఆర్టీసీకి ఇప్పుడు తప్పనిసరి. అయితే, వేరే మార్గంలో ఇప్పటికిప్పుడు ఆదాయం సమకూరే అవకాశం లేదు. దీంతో చార్జీల పెంపుదల ప్రతిపాదన చేస్తున్నారు.

అయితే, ఈ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని ధరలూ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగితే మరింత ఇక్కట్లు తప్పవు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక కోవిడ్ నేపధ్యంలో ఇప్పటికీ హైదరాబాద్ లో సిటీబస్సులు పూర్తిస్థాయిలో ఇప్పటికీ తిరగడం లేదు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు మొదట 25 శతం, తరువాత 50 శాతం తిరగటానికి అనుమతులు ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి సిటీలో సర్వీసులు 75 శాతం పెంచుకునేందుకు సమావేశంలో అనుమతి ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories