TSRTC New Year Offer: టీఎస్‌ఆర్టీసీ న్యూ ఇయర్‌ కానుక.. వారికి ఉచిత ప్రయాణం..

TSRTC New Year Offer: పండుగ ఏదైనా ప్రయాణీకుడి ముక్కు పిండి ఖజానా నింపుకోవడమే ఆర్టీసీల పని.

Arun Chilukuri
Published on: 31 Dec 2021 1:16 PM IST
TSRTC Offer Free Ride To Children Below 12 Years on New Year 2022
X

TSRTC New Year Offer: టీఎస్‌ఆర్టీసీ న్యూ ఇయర్‌ కానుక.. వారికి ఉచిత ప్రయాణం..

TSRTC New Year Offer: పండుగ ఏదైనా ప్రయాణీకుడి ముక్కు పిండి ఖజానా నింపుకోవడమే ఆర్టీసీల పని. అలాంటిది విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది టీఎస్ ఆర్టీసీ. సంస్థను గాడిలో పెడుతున్న ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణం ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.

12 ఏళ్లలోపు పిల్లలందరికీ జనవరి 1న ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 30న ఆయన సర్క్యూలర్ విడుదల చేశారు. ఇందుకు విధిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వారితో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ బస్సులోనైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story