TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

TSRTC: సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీకి 107 కోట్ల ఆదాయం వచ్చింది.

Arun Chilukuri
Updated on: 18 Jan 2022 7:21 PM IST
TSRTC Gets Record Income for Sankranthi Festival
X

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

TSRTC: సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీకి 107 కోట్ల ఆదాయం వచ్చింది. మూడ్రోజుల పండగ సందర్భంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు సంస్ధ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి చెప్పారు. ఆర్టీసీని ప్రజలు ఆదరించడం వల్లే ఇది సాధ్యమయిందన్నారు ఎండీ సజ్జనార్‌. ఇకపై కూడా ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని కోరుతున్నట్లు చెప్పారు ఎండీ సజ్జనార్‌.

మరోవైపు, ఇదే టైంలో ఏపీఎస్​ఆర్టీసీ అదనపు ఛార్జీలు బాదడం తెలంగాణ ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 14 వరకు 4,000 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించింది. అందులో ఆంధ్రప్రదేశ్​కు వెయ్యి బస్సులు కాగా మిగిలిన 3,000 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడిపింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story