Peddapalli: లోయలో పడిన బస్సు.. ఒకరి మృతి,16 మందికి గాయాలు

Peddapalli: పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 6 Oct 2021 3:04 PM IST
TSRTC Bus Falls Into Gorge in Peddapalli
X

Peddapalli: లోయలో పడిన బస్సు.. ఒకరి మృతి,16 మందికి గాయాలు

Peddapalli: పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా, 16 మంది గాయపడ్డారు. పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్న క్రమంలో గాడిదులగండి వద్ద ఓ కారును ఢీకొట్టింది. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

దీంతో కారులో ఉన్న వ్యక్తి మరణించగా, బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌గా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story