VC Sajjanar: రికార్డు ఆదాయాన్ని పొందిన ఆర్టీసీ.. ఎంతంటే..

* ఆదాయం రాబడిలో రికార్డులు తిరగరాసిన టీఎస్‌ ఆర్టీసీ * నిన్న ఒక్కరోజే టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం 14.06 కోట్లు

Sandeep Reddy
Updated on: 24 Nov 2021 2:39 PM IST
TSRTC Sees Highest Single-day Earnings of 14.06 cr
X

VC Sajjanar: రికార్డు ఆదాయాన్ని పొందిన ఆర్టీసీ.. ఎంతంటే..

VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ నయా రికార్డ్‌ సాధించింది. ఆదాయం రాబడిలో రికార్డులు తిరగరాసింది టీఎస్‌ ఆర్టీసీ. నిన్న ఒక్కరోజే టీఎస్‌ ఆర్టీసీకి 14కోట్ల 6లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 36లక్షల 10వేల మంది ప్రయాణికులను తరిలించనట్లు సమాచారం. నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీ సజ్జనార్ తీసుకుంటున్న చర్యలు ఆ సంస్థకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎండీ సజ్జనార్ అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేశారు. దీంతో పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్సులకు ఆద్దెకు తీసుకున్న వారికి ప్రోత్సహకాలు ప్రకటించారు.. పెళ్లి చేసుకున్న నవవధువులకు ఆర్టీసీకి గుర్తుగా ఓ ఫోటోను బహుకరించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story