ATM Robbery Case: ఆ ముఠాపనే..ఒకరిని పట్టుకున్నపోలీసులు

TS Police Arrested one of the Accused in the robbery case at HDFC ATM Kukatpally Hyderabad
x

కూకట్పల్లి ఎటిఎం చోరీ (ఫైల్ ఇమేజ్)

Highlights

ATM Robbery Case: కేసును ఛేదించేందుకు 12 పోలీస్‌ బృందాలు ఏర్పాటు * ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు సమాచారం

ATM Robbery Case: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని HDFC ATM లో దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన ఇద్దరూ.. పాత నేరస్థులేనని పోలీసులు గుర్తించారు. ఏప్రిల్‌ 16న జీడిమెట్ల పరిధిలోని ఓ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో తుపాకీతో బెదిరించి, దోపిడీకి ఈ ఇద్దరు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి చోరీని కేసును ఛేదించేందుకు 12 బృందాలను ఏర్పాటు చేయగా.. దుండగుల్లో ఒకరిని హైదరాబాద్‌లోనే పట్టుకున్నట్టు స్పష్టం చేశారు.

మరొక నిందితుడు తుపాకీ, డబ్బుతో పరారైనట్టు వెల్లడించారు. బీహార్‌, మహారాష్ట్రకు చెందిన ఈ ఇద్దరూ దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో నివాసం ఉంటూ.. రోజువారీ కూలీలుగా పనిచేసేవారని పోలీసులు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories