Kishan Reddy: బీజేపీ ఓటు బ్యాంక్‌ 100 శాతం పెరిగింది

Kishan Reddy: ప్రజా తీర్పు గౌరవిస్తున్నాం

Jyothi
Published on: 4 Dec 2023 8:46 AM IST
TS Elections Results Kishan Reddy thanks to the Kamareddy People
X

Kishan Reddy: బీజేపీ ఓటు బ్యాంక్‌ 100 శాతం పెరిగింది

Kishan Reddy: ప్రజా తీర్పు గౌరవిస్తున్నామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించడంతో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు కిషన్‌రెడ్డి కామారెడ్డి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి బీజేపీకి విజయం చేకూర్చిన కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాము అనుకున్న ఫలితాలు రానప్పటికీ బీజేపీ ఓటు బ్యాంక్‌ దాదాపు 100 శాతం పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో 6.9 శాతం ఉన్న భాజపా ఓటు బ్యాంక్‌ ఈసారి 14 శాతానికి పెరిగిందన్నారు. ఒక స్థానం నుంచి 8 స్థానాలకు వెళ్లామన్నారు.

Jyothi

Jyothi

Next Story