దసరాకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Tsrtc Special Buses : దసరా పండుగకు 3వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. ఈనెల 24 వరకు ఈసేవలు కొనసాగుతున్నట్లు తెలియజేసింది.

Krishna
Updated on: 22 Oct 2020 7:25 PM IST
దసరాకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
X

TRSTC 

Tsrtc Special Buses : దసరా పండుగకు 3వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. ఈనెల 24 వరకు ఈసేవలు కొనసాగుతున్నట్లు తెలియజేసింది. అదేవిధంగా ఈనెల 22 నుంచి 24 మధ్య 2వేల 34 సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇక ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే రిజర్వేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు ఆర్టీసీ అధికారులు. అయితే ఈ ప్రత్యేక సర్వీసులు ఇతర రాష్ట్రాలకు కాకుండా తెలంగాణ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.

అటు దసరా పండగను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ ఈ నెల 16 నుంచి స్పెషల్ బస్సులను నడపతుంది. ఈ నెల 26 వరకు మొత్తం 1850 బస్సులను అదనంగా ఆయా రూట్లలో నడపనుంది. ఇందులో బెంగుళూరుకి 562ప్రత్యేక బస్సులను కేటాయించారు. అయితే కరోనా తగ్గకపోవడంతో తమిళనాడు సరిహద్దు వరకే బస్సులను నడపనున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వంతో ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడంతో తెలంగాణకు మాత్రం బస్సులను నడపడం లేదు.

Krishna

Krishna

Next Story