ప్రగతి భవన్ వయా కేటీఆర్ ఆఫీస్..కేబినెట్‌ రేసులో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?

ప్రగతి భవన్ వయా కేటీఆర్ ఆఫీస్..కేబినెట్‌ రేసులో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?
x
Highlights

ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రగతి భవన్ టు కేటీఆర్ ఆఫీస్‌కు చక్కర్లు కొడుతున్నారు. ఐతే ప్రభుత్వాధినేత, లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని కలిసేందుకు పోటీ...

ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రగతి భవన్ టు కేటీఆర్ ఆఫీస్‌కు చక్కర్లు కొడుతున్నారు. ఐతే ప్రభుత్వాధినేత, లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని కలిసేందుకు పోటీ పడుతున్నారు. తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఐతే ఇదంతా నియోజకవర్గ అభివృద్ది నిధుల కోసం అనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ఆ ఎమ్మెల్యేలకు దానికంటే ఇంపార్టెంట్ మరోటుంది. ఇంతకీ ఆ ఇంపార్టెంట్ టాస్క్ ఏమై ఉంటుంది...? నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్ హీటెక్కించిన మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌కు తాకింది. గులాబీదళం కేబినెట్ కూర్పు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది.

రెండో దశ మంత్రివర్గ విస్తరణలో గంపెడాశలు పెట్టుకున్న నేతలంతా ఐతే కేసీఆర్ లేదంటే కేటీ ను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్ లో మకాం వేశారు. బెర్త్ కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ మంత్రి రేసులో ఉన్న ఇందూరు ఎమ్మెల్యేలు ఎవరూ.. వారికి కలిసొచ్చే అంశాలేంటి? రెండో విడత మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తమకు కేసీఆర్ క్యాబినెట్‌లో బెర్త్ దక్కుతుందని కొంత కాలంగా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఏదో వంక పెట్టుకుని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఐతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే బాన్సువాడ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డికి కామారెడ్డి జిల్లా కోటాలో స్పీకర్‌గా, నిజామాబాద్ జిల్లా కోటాలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మంత్రిగా భర్తీ చేసిన సీఎం కేసీఆర్...రెండో విడతలో సామాజిక సమీకరణల దృష్టా మరో మంత్రి పదవి జిల్లాకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే ఆ మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో ఉత్కంఠ కలిగిస్తోంది. దీంతో ఎవరికి వారే తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు.

నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ది కంటే పెద్ద టాస్క్ ముందుంది. అందుకనే ఆ ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా హైదరాబాద్ లో మకాం వేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే పార్టీ అధినేత సూత్రప్రాయంగా చెప్పినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల పర్ఫార్మెన్స్ ను బట్టి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యేలకు చెప్పారట. ఐతే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేలతో పాటు పార్టీని షాక్‌కు గురిచేశాయి. ఎంపీగా పోటీ చేసిన కవిత ఓటమి పాలయ్యారు. కవిత ఓటమిలో ఎమ్మెల్యేల పాత్ర ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో కొద్ది మంది నేతలు అధినేత వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకవేళ వెళితే రియాక్షన్ ఏ స్ధాయిలో ఉంటుందోనని వణికిపోతున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంగ్‌లో, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కేవలం రెండు నియోజకవర్గాల్లోనే ఆ పార్టీకి లీడ్ వచ్చింది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి గండి పడింది. దీంతో లీడ్ వచ్చిన నిజామాబాద్ అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు సీఎం గుడ్ లుక్స్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరికి వారివారి సామాజిక బలం మరింత పాజిటివ్ గా మారింది. ఇక నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ బలంగా ఉన్నా, టీఆర్ఎస్‌కు లీడ్ రావడం, బోధన్‌లోను టీఆర్ఎస్‌కు మెజార్టీ రావడంతో సీఎం ఆ ఇద్దరి పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. క్యాబినెట్ బెర్త్‌లో వైశ్య సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని గులాబీ బాస్ భావిస్తుండటంతో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కలిసొస్తుందని ప్రచారం సాగుతోంది. మైనార్టీల ప్రతినిధిగా గెలిచిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ సైతం రేసులో పరుగెడుతున్నారు. ఐతే మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా ఉండటంతో షకీల్ కు మంత్రి పదవి ఇవ్వడం అనుమానమే అంటున్నా రు రాజకీయ విశ్లేషకులు. నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్ లో ఇప్పటికే ఓ బెర్త్, స్పీకర్‌గా మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన సీఎం కేసీఆర్ మరో మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ మరో మంత్రి పదవి జిల్లాకు కేటాయిస్తే ఆ అదృష్టవంతులు ఎవరో, సామాజిక వర్గం ఏ మేరకు కలిసొస్తుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories