TRS MLA Tests Positive : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Arun Chilukuri
Published on: 26 Aug 2020 2:33 PM IST
TRS MLA Tests Positive : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
X

TRS MLA Tests Positive : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయనతో పాటుగా అయన భార్యకు కూడా కరోనా సోకింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఎమ్మెల్యే కోన‌ప్ప కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. మృతుల సంఖ్య 780కి పెరిగింది. మరోవైపు నిన్న 1,060 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 85,233కి చేరింది. ప్రస్తుతం 25,685 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 19,113 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story