Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు

Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు
x
Highlights

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. మృతుల సంఖ్య 780కి పెరిగింది. మరోవైపు నిన్న 1,060 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 85,233కి చేరింది.

ప్రస్తుతం 25,685 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 19,113 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.69 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 76.30కు చేరుకుంది. గత 24 గంటల్లో 61,040 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటి వరకూ మొత్తంగా 10,82,094 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories