భవిష్యత్తులో కూడా కార్మికులకు మరింత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

భవిష్యత్తులో కూడా కార్మికులకు మరింత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
x
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారి నాగేశ్వరరావు
Highlights

ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన చర్చలలో కార్మికుల కోర్కెలను నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.

మధిర: ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన చర్చలలో కార్మికుల కోర్కెలను నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మధిర బస్ డిపో వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి, కార్మికులు అడిగిన కోరికలనే కాకుండా మరిన్ని అవకాశాలను వారికి కల్పించారు.

భవిష్యత్తులో కూడా కార్మికులకు మరింత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి చిత్తారి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగా రావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, భరత్ విద్యాసంస్థల అధినేత భరత్ వెంకట్ రెడ్డి, వెలగపూడి శివరాం ప్రసాద్, మొండితోక సుధాకర్, యెన్నం కోటేశ్వరరావు, బిక్కిప్రసాద్, కనుమూరి వెంకటేశ్వరరావు, దోకుపర్తి సత్యంబాబు, చావ వేణు, ఎర్రగుంట రమేష్, ఏన్నంశెట్టి అప్పారావు, ములకలపల్లి వినయ్ కుమార్, వేముల శ్రీను, నాగులవంచ రామారావు, కపిలవాయి జగన్మోహరావు, కుంచం శ్రీనివాసరావు, కొఠారి రాఘవరావు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories