కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది

K V D Varma
Published on: 19 July 2019 8:58 PM IST
కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది
X

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తున్నారనే భయం అధికార టీఆర్ఎస్‌కు పట్టుకుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. త్వరలోనే తన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని, తమలాంటి నేతలు బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీ బలపడుతుందని చెప్పుకొచ్చారు. తాను బీజేపీలోకి వెళ్లినా ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయనబోనని స్పష్టం చేశారు. అయితే ఏ పదవి ఆశించి పార్టీ మారడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ మునిగిపోయిన నావ అని.. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారం బీజేపీదే అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

K V D Varma

K V D Varma

Next Story