సహకార ఎన్నికల టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే రాజయ్య

సహకార ఎన్నికల టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే రాజయ్య
x
Highlights

మండలంలోని జానకిపురం గ్రామంలో సహకార ఎన్నికల సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డా టి రాజయ్య మాట్లాడుతూ... తెరాస బలపర్చిన 7 వార్డ్ అభ్యర్థి చాడ విజయను గెలిపించాలని కోరారు.

ధర్మసాగర్: మండలంలోని జానకిపురం గ్రామంలో సహకార ఎన్నికల సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డా టి రాజయ్య మాట్లాడుతూ... తెరాస బలపర్చిన 7 వార్డ్ అభ్యర్థి చాడ విజయను గెలిపించాలని కోరారు. వారి గెలుపు ద్వారా రైతులందరికీ మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

మారపాక రజిత రత్నం నామినేషన్ వేసి పార్టీ ఆదేశాల మేరకు విరమించుకుని చాడ విజయ గెలుపుకు సహకరిస్తున్న మారపాక రజితకి రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పించి వారి సేవలు పార్టీకి వాడుకుంటామని తెలియజేసారు. గెలిచిన ప్రతి ఒక డైరెక్టర్ గుడ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి చైర్మన్ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, సర్పంచులు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories