లక్షణాలు కనబడకుంటే ఇంటి వద్దే ట్రీట్మెంట్!

లక్షణాలు కనబడకుంటే ఇంటి వద్దే ట్రీట్మెంట్!
x
Representational Image
Highlights

కరోనా వైరస్ వ్యాపి తీవ్రం కావడంతో రోగులకు అందించే చికిత్సలో మార్పులు చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాపి తీవ్రం కావడంతో రోగులకు అందించే చికిత్సలో మార్పులు చేస్తున్నారు. ఇంతవరకు వైరస్ సోకితే చాలు ఆ వ్యక్తితో పాటు ఇంటి పక్కల, చుట్టుపక్కల వారిని క్వారెంటైన్ కు తరలించేవారు. అయితే తాజాగా వైరస్ సోకిన రోగికి వాటి లక్షణాలు లేకుంటే ఇంటి వద్ద ఉంచి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఈ పద్ధతిని ఇప్పటికే అమలు చేస్తోంది.

జ్వరం,దగ్గు,జలుబు లాంటి ఎలాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏండ్ల వయస్సులోపు కోవిడ్​ పేషేంట్లను గాంధీ ఆసుపత్రి నుంచి వారివారి ఇండ్లకు హోం క్వారంటైన్​కు తరలిస్తున్నారు. ఈమేరకు సోమవారం మొత్తం 393మంది కరోనా పాజిటివ్​ పేషేంట్లను గాంధీ నుంచి క్వారంటైన్​కు తరలించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్​ ఫ్రొ.డా.ఎం.రాజారావు పేర్కొన్నారు. తమ ఇండ్లల్లో ప్రత్యేక గది వసతి కలిగి ఉన్న 310 మందిని హోంక్వారంటైన్​కు, మిగితా 83 మందిని అమీర్​పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు ఆయన వివరించారు.

ఇందుకు గాంధీనుంచి ప్రత్యేక 30 అంబులెన్స్​లు, మూడు బస్సులను వినియోగించారు. ఇలా రెండు వారాల పాటు క్వారంటైన్​లో ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులపై పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ వారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే పేషేంట్లు ఒక వేళ ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే కోవిడ్​ నెంబర్​కు ఫోన్​ చేసి తమ సమస్యలను తెలిపి, తగిన సూచనలు, వైద్యం పొందవచ్చన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories