Suryapet: ఇంటి పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌.. తండ్రి, కొడుకు మృతి..!

Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 26 Dec 2025 4:23 PM IST
Suryapet: ఇంటి పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌.. తండ్రి, కొడుకు మృతి..!
X

Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లు నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కొడుకు మృతి చెందారు. ట్రాక్టర్ ట్యాంకర్‌లోని మోటర్‌ వేసి, నీళ్లు కొడుతుండగా అకస్మాత్తుగా నీటితో పాటు విద్యుత్ సరఫరా కావడంతో తండ్రి బుచ్చయ్య, విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

ఈ విషయాన్ని గమనించకుండా కుమారుడు లోకేష్ ట్యాంకర్‌ను తాకడంతో షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. కుటుంబికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story