చలానా బదులు లైసెన్స్..ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే!

చలానా బదులు లైసెన్స్..ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే!
x
Highlights

హైదరబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దేశంలోని అందరు పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల వాహనదారులు నియమాలను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధిస్తూ...

హైదరబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దేశంలోని అందరు పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల వాహనదారులు నియమాలను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రజల్లో అవగాహన పెంచడం.. దానితో పాటు నియమాల ఉల్లంఘిస్తే వారికి సరైన కౌన్సెలింగ్ విధానం వంటివి వదిలి పెట్టి ఇంత ఘోరంగా జేబులు కొల్లగోడుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. అయితే, హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా ఇంకా చెప్పాలంటే అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రవర్తించి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదీ అని నిరూపించారు.

కొద్ది రోజులుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ట్రాఫిక్ పోలీసులు శనివారం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ వినూత్న ప్రయత్నం చేశారు. డీజీపీ, రాచకొండ సీపీ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు చలాన్లు విధించకుండా నిబంధనలకు అనుగుణంగా వారికి ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను మంజూరు చేయిస్తామని రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌ రావు తెలిపారు. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద శనివారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్‌ లేని బైకర్లతో అక్కడికక్కడే హెల్మెట్ కొనిపించారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ తదితర సర్టిఫికెట్లు లేకుంటే వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి సమన్వయం చేశారు. లైసెన్సులు లేనివారికి పోలీసులు అప్పటికప్పుడే స్లాట్ బుక్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు అందే శ్రీనివాస్, పి శ్రీనివాస్, ఎం శంకర్, రాచకొండ పరిధిలోని ట్రాఫిక్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

ఒక్క చలాన కూడా లేకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్న వాహనదారులకు సినిమా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన పోలీసులు.. నిబంధనలు అతిక్రమించిన వారి పట్ల కూడా సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తుండడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. ఇదిలా ఉండగా రాచకొండ పోలీసుల విధానం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఅర్ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు అయన ఓ ట్వీట్ చేస్తూ, 'గుడ్ మూవ్' అని ప్రశంసించారు.

రాచకొండ పోలీసులు అమలు చేస్తున్న ఈవిధానం ఎలా ఉందని మీరనుకుంటున్నారు? ఇక్కడ తెలియచేయండి



Show Full Article
Print Article
More On
Next Story
More Stories