మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు వారికే..ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు వారికే..ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
x
Highlights

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు యాభై శాతం టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డిలో...

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు యాభై శాతం టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మేరకైనా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయన డిమాండ్ చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ కొత్త మున్సిపల్ చట్టం లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. అంతే కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తొలగించే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కౌన్సిలర్లే ఛైర్మన్లను నేరుగా ఎన్నుకునే పద్ధతిని కొత్త చట్టంలో పొందుపరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్త్రం చేశారు. ఈ సమావేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, 32 జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు, కీలక నేతలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories