డివిజన్ల విభజన హేతుబద్ధంగా ఉండాలి : టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

డివిజన్ల విభజన హేతుబద్ధంగా ఉండాలి : టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
x
ఉత్తమ్ కుమార్ రెడ్డి
Highlights

Uttam Kumar Reddy Challenge Ts government : అర్హులైన ఒక శాతం మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తే బల్దియా ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ సవాల్‌ విసిరారు.

Uttam Kumar Reddy Challenge Ts government : అర్హులైన ఒక శాతం మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తే బల్దియా ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ సవాల్‌ విసిరారు. ఆదివారం ఇందిరా భవన్‌లో నిర్వహించిన సిటీ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్లలో ఓటర్లు సమానంగా ఉండాలని తెలిపారు. డివిజన్ల విభజన హేతుబద్ధంగా ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముందుగానే విన్నవిస్తున్నామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టును అనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకువచ్చారని ఆయన ఈ సందర్బంగా గుర్తుచేశారు. సచివాలయంలో ఆలయం, మసీదు కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సచివాలయం కూల్చివేత బాధ కల్గించిందని, అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీల్లో ఆగస్టు 24వరకు పార్టీ కమిటీలు పూర్తి చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి విషయాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లుతామని అన్నారు. అనుబంధ విభాగాల కమిటీలు కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి కి ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదని దుయ్యబాట్టారు. మూసీ ప్రక్షాళన ఆరేళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. సచివాలయంలోని పవిత్రమైన దేవాలయం, మసీదు కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. మూడు పెద్ద నగరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి వెళతామని అన్నారు. మసీదు, మందిర్ కూల్చివేతపై ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారని, కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందని చెప్పిన ఎంఐఎం బ్రదర్స్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలు కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories