గోదావరి జల దీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతల అరెస్ట్

గోదావరి జల దీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతల అరెస్ట్
x
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైల్ ఫోటో
Highlights

గోదావరి నదిపై కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను ప్రాజెక్టులను సందర్శించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌...

గోదావరి నదిపై కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను ప్రాజెక్టులను సందర్శించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం 'గోదావరి జల దీక్ష'పై డీసీసీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో గాంధీభవన్‌ నుంచి ఫోన్‌ లో మాట్లాడారు. శనివారం రోజు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం రోజున డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు.

ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం గోదావరి జల దీక్షకు బయలుదేరారు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు నేతను అరెస్టు చేసారు. కాగా అరెస్ట్ అయిన నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్ నేపథ్యంలో తుమ్మీడి హేట్టి కి వెళ్లాలా వద్ద అనే సంశయం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండిపోయారు. నేతలందరినీ అరెస్ట్ చేసిన తరువాత తాను మాత్రం తుమ్మిడిహెట్టి వెళ్ళడం లో ఉపయోగం లేదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

ఇక ఉన్నపలంగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని పొన్నం ప్రభాకర్ ఖండించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం పట్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు జలదీక్షలు చేపట్టామని తెలిపారు. తాము ప్రాజెక్టులో దగ్గరికి వెళ్లడం వల్ల మీ ప్రభుత్వం ఏమి కూలిపోదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విధంగానైనా మీరు తొందరగా ప్రాజెక్టు కడతారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడితే పోలీసులు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అప్పర్ మానేరు (నార్మాల) ప్రాజెక్టు దగ్గరికి ఇప్పటికే మా కార్యకర్తలు చేరుకున్నారని, ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలకు చేరవేయడంలో మా లక్ష్యం నెరవేరిందని ఆయన అన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో అప్పర్ మానేరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదో ప్యాకేజీలో ఉన్న కొండపోచమ్మ పూర్తిచేసి, తొమ్మిదో ప్యాకేజీ లో ఉన్న అప్పర్ మానేరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగారు. అక్టోబర్ లోగా అప్పర్ మానేరు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీకి కేటీఆర్ కట్టుబడి ఉండాలి. లేదంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు. చిన్న వర్షాలకి కొండమ్మ పోచమ్మ సాగర్ కాలువలు కొట్టుకుపోయాయి అంటే నాణ్యత ఎట్లా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.

అటు కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజెప్పాలని తాము జలదీక్షలకు పూనుకుంటే అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. పోలీసుల వైఖరి చూస్తుంటే తాము నిషేధిత ప్రాంతంలో ఉన్నామా అనిపిస్తుందన్నారు. ఓకే లిఫ్ట్ సహాయంతో తుమ్మిడిహట్టి నుంచి 38 వేల కోట్లతో ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉన్నా.. కేసిఆర్ తనకు పేరు రావాలని ఉద్దేశంతో మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారని తెలిపారు. దీంతో లక్షా ఇరవై వేల కోట్లకు ప్రాజెక్టు వ్యయం చేరి తెలంగాణ ప్రజలకు మోయలేని భారంగా మారిందన్నారు. మేడిగడ్డ వద్ద అదనపు టీఎంసీ నీళ్ళ తరలింపునకు కమీషన్ల కోసం 4 వేల కోట్ల పనులు నామినేషన్ పద్ధతిపై కేటాయించారని తెలిపారు.

ఎవడబ్బ సొమ్మని ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు. నాలుగు వేల కోట్ల పనులను నామినేషన్ పై కేటాయించడం ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని తెలిపారు. ఇదే నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణంతో పాటు కాలువలు రీడిజైన్ చేసి నేరుగా ఎల్లంపల్లికి ప్రతిరోజు ఒక టీఎంసీ నీరు తరలించవచ్చన్నారు. తుమ్మిడిహెట్టి నిర్మాణం పూర్తయితే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చని స్పష్టం చేసారు. ప్రాజెక్టు ప్రారంభించి వారం రోజులు కాకముందే కొండపోచమ్మ లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయని తెలిపారు. ఒక వానకే కాలువలు కొట్టుకుపోయాయయని ఎద్దేవాచేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories