Mahesh Kumar Goud: ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..

Mahesh Kumar Goud: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Oct 2024 12:57 PM IST
Mahesh Kumar Goud: ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..
X

Mahesh Kumar Goud: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు. మహిళల మనోభావాలను కించపర్చడం ఆమె ఉద్దేశ్యం కాదన్న టీపీసీసీ చీఫ్‌.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విన్నవించారు.

ఇరువైపులా కూడా మహిళలే ఉన్నారన్నారు. మహిళల పట్ల కేటీఆర్‌ అహంకార ధోరణిని ప్రశ్నించడమే కానీ.. ఎవరి మనోభావాల్నీ దెబ్బతీయడం ఉద్దేశం కాదని సురేఖ పేర్కొన్నట్లు చెప్పారు. ఇకపై కాంగ్రెస్‌ నేతలంతా జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌.

Also Read: Konda Surekha Latest Comments: వారి ట్వీట్స్ చూసి నేను బాధపడ్డాను..కేటీఆర్ విషయంలో అస్సలు తగ్గేదేలే

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story