Konda Surekha Latest Comments : వారి ట్వీట్స్ చూసి నేను బాధపడ్డాను..కేటీఆర్ విషయంలో అస్సలు తగ్గేదేలే

Konda Surekha Latest Comments : తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే..తాను ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Oct 2024 11:06 AM IST
Minister Kondasurekha gave an explanation on the KTR issue and spoke to the media at her residence in Hanmakonda
X

Konda Surekha Latest Comments : వారి ట్వీట్స్ చూసి నేను బాధపడ్డాను..కేటీఆర్ విషయంలో అస్సలు తగ్గేదేలే

Konda Surekha Latest Comments : తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే..తాను ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం తాను అస్సలు తగ్గేలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ క్షమాపన చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

చేసిందంతా చేసి దొంగే దొంగ అని అరిచినట్లు కేటీఆర్ ప్రవర్తన ఉందన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక ఫ్యామిలీ పేరు వచ్చిందన్నారు. తాను పడిన బాధ మరొకరు పడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ తెలిపారు.

తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల విమర్శించాల్సి వచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. తాను ఈ విషయంపై గురువారం వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక ఫ్యామీలీ పేరు వచ్చిందన్నారు కొండా సురేఖ.

ఆ కుటుంబం నుంచి వచ్చిన ట్వీట్స్ చూసిన తర్వాత తాను చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. తాను బాధపడుతున్నట్లు మరొకరు బాధపడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. హన్మకొండలోని తన నివాసంలో మంత్రి మీడియాకు ఈ విషయాలన్నీ వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story