అతిపెద్ద డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి.. అతిచిన్న డివివిజన్ రామచంద్రాపురం

అతిపెద్ద డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి.. అతిచిన్న డివివిజన్ రామచంద్రాపురం
x
Highlights

బల్దియా పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం జరిగే బల్దియా పోరుకు సర్వం సిద్ధం అయింది. అందుకోసం పోలింగ్ కేంద్రాలు,...

బల్దియా పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం జరిగే బల్దియా పోరుకు సర్వం సిద్ధం అయింది. అందుకోసం పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఓటర్ల స్లిప్‌లు పంపిణీ పూర్తి చేసింది. ఇక గ్రేటర్ ఎన్నికల కోసం పోలీస్ సిబ్బంది కూడా రెడీ అయింది.

బల్దియా పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. గ్రేటర్ పరిధిలో ఉన్న 150 డివిజన్‌ల పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 44 వేల 260 మంది ఉన్నారు. అందులో పురుషులు 38లక్షల 89వేలకు పైగా మంది, స్త్రీలు 30లక్షల 76వేలకు పైగా మంది, ఇతరులు 415మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్‌లకు గానూ 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎం.ఐ.ఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 76 మంది బరిలో ఉన్నారు.

గ్రేటర్ ఎన్నికల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లను 60 టీంలను, మొత్తం పోలింగ్ సిబ్బంది 36 వేల 404 మంది అందుబాటులో ఉన్నారు. వారిలో పోలింగ్ అధికారులు 9 వేల నూట ఒకటి మందిని అందుబాటులో ఉంచనున్నారు. 18వేల కు పైగా బ్యాలెట్ బ్యాక్స్‌లను ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్లు 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

గ్రేటర్ పరిధిలో మైలార్‌దేవ్ పల్లి డివిజన్ అతిపెద్దగా ఉంది. అతి చిన్న డివిజన్‌గా రామచంద్రపురం డివిజన్‌ ఉంది. మైలార్‌దేవ్‌పల్లి లో 79 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఆర్కే పురంలో అతి తక్కువగా 27వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీసీకి 50 సీట్లు కేటాయించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలకు అన్ని సిద్ధం అయ్యాయి. ఇక పోలింగ్‌కు 48గంటలకు ముందే ప్రచారం ముగిసింది. మరోవైపు ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం భారీగా ప్రచారాన్ని ఏర్పాట్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories