ఇవాళ నర్సంపేట మున్సిపాలిటీలో విశ్వాస పరీక్ష

Warangal: ఛైర్మన్ గుంటి రజినీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు

Jyothi
Published on: 30 Jan 2024 10:20 AM IST
Today is a Test of faith in Narsampet Municipality
X

ఇవాళ నర్సంపేట మున్సిపాలిటీలో విశ్వాస పరీక్ష

Warangal: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఛైర్మన్‌పై చేసిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే విశ్వాస పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

మున్సిపల్ ఛైర్మన్ గుంటి రజినీ కిషన్‌పై ఈనెల 2న సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. కలెక్టర్‌కు తీర్మానం సమర్పించగా.. ఇవాళ విశ్వాస పరీక్షకు తేదీ ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్షకు ముందు చైర్మన్ గుంటి రజినీ కిషన్‌తో సహా మరో ఇద్దరు కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. దీంతో అవిశ్వాస వర్గానికి మొండిచేయి ఎదురైంది. ఛైర్మన్ క్యాంప్‌లో ఉన్న కౌన్సిలర్లు ఓటేస్తేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉండటంతో.. ఇవాళ ఓటింగ్‌ జరుగుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

అయితే క్యాంపుకి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి వచ్చి అవిశ్వాసానికి సహకరించాలని డిమాండ్ చేస్తోంది అవిశ్వాస వర్గం. లేకపోతే తామంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్‌ నేతలు బుజ్జగింపులకు దిగారు. నిన్న మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ కవితను అవిశ్వాస వర్గంలోని 15 మంది కౌన్సిలర్లు కలిశారు. దీంతో విశ్వాస పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

Jyothi

Jyothi

Next Story