Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర

Today Hanuman Shobhayatra in Hyderabad | TS News Today
x

హైదరాబాద్‌లో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర

Highlights

Hyderabad: గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ వరకు శోభాయాత్ర

Hyderabad: హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు హైదరాబాద్ నగరం సిద్ధమయ్యింది. ఈ శోభాయాత్రం సందర్భంగా పలు ఆంక్షలు కూడా అమలు జరుగనున్నాయి. హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్న క్రమంలో పలు ఆంక్షలు విధించారు పోలీసులు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. హనుమాన్ శోభా యాత్ర సందర్భంగా 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించి డైవర్షన్ రూట్లను వెల్లడించారు. ఏయే రూట్లలో వెళ్లాలో సూచించారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ లోని హనుమాన్ టెంపుల్ కు చేరుకుని ముగుస్తుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories