CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR: ఇండ్ల పట్టాల పంపిణీపై దిశానిర్ధేశం చేయనున్న కేసీఆర్

Dhatripriya
Published on: 25 May 2023 9:20 AM IST
Today CM KCR High Level Review
X

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష  

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్‌ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయం 6వ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో తొలిసారి సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.

Dhatripriya

Dhatripriya

Next Story