పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతు

Arun Chilukuri
Published on: 20 Dec 2020 5:52 PM IST
పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతు
X

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పులిగుండాల ప్రాజెక్ట్ దగ్గర చెరువులోకి ఈతకు దిగిన యువకులు గల్లంతయ్యారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 8 మంది స్నేహితుల బృందం పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్లింది. వీరిలో ఐదుగురు ఈతకు దిగారు. నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దర్ని స్థానికులు రక్షించగా మిగతా ముగ్గురు జంగా గుణ (24), శీలం చలపతి (25), వేమిరెడ్డి సాయి (25) గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు కల్లూరు మండలం బత్తుల పల్లికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పెనుబల్లి, కల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story