తెలంగాణలో మూడేళ్ళ బాలుడికి కరోనా! 41 కి చేరిన బాధితులు!!

తెలంగాణలో మూడేళ్ళ బాలుడికి కరోనా! 41 కి చేరిన బాధితులు!!
x
Representational Image
Highlights

సౌదీ అరేబియా నుంచి వచ్చిన మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ నో తెలిపారు....

సౌదీ అరేబియా నుంచి వచ్చిన మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ నో తెలిపారు. దీనితో పాటు హైదరాబాద్ కు చెందిన 43 ఏళ్ల మహిళకు కూడా కరోనా పాజిటివ్ తేలినట్టు ఆ బులిటెన్ లో పేర్కొన్నారు. దీంతో బుధవారం (మార్చి 25) సాయంత్రానికి తెలంగాణాలో రెండు కొత్త కేసులు నమోదు అయినట్టయింది. ఇప్పటి వరకూ తెలంగాణా రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 41.

హైదరాబాద్ కు చెందిన మహిళకు P34 బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాపించింది. ప్రస్తుతం ఈమెకు చికిత్స కొనసాగుతోందని.. పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ కేసుతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.

ఇక మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశం. అయితే, ఈ చిన్నారి పరిస్థితి కూడా నిలకడగానే ఉందని వైద్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ రెండు కొత్త కేసులను P40, P41గా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదు అయిన మొత్తం 41 కేసు లలో ఓ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా అనుమానిత లక్షణాలతో 50 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్య బులెటిన్‌లో వెల్లడించారు.

కరోనా నియంత్రణకు స్వీయ నియంత్రణ పాటించాలని.. ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో ప్రజా ప్రతినిధులందరూ ఇవాళ రోడ్లపైకి వచ్చారు. రోడ్ల మీదకు వస్తున్న వారిని పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. అత్యవసరాలు ఉన్నవారికి సాయం అందించారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి చాలా వరకు మెరుగైనట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories