హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

X
Highlights
న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సికింద్రాబాద్‌లో ముగ్గురు డ్రగ్...
Arun Chilukuri31 Dec 2020 12:03 PM GMT
న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సికింద్రాబాద్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పెద్దఎత్తున మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకలే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతుండగా ఈ మత్తు పదార్ధాలను పట్టుకున్నారు.
మొత్తం 10లక్షల విలువైన మత్తు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 గ్రాముల MDMA, 75 LSD బోల్ట్స్, 60 ఈక్సీటాసీ పిల్స్, కిలో హాష్ ఆయిల్‌తోపాటు గంజాయిని సీజ్ చేశారు. వీటిని ముంబైలో తక్కువ ధరకు కొనుగోలుచేసి హైదరాబాద్‌లో డబుల్ రేట్‌కు విక్రయిస్తున్నారు.
Web TitleThree held in Hyderabad with drugs
Next Story