Rain Alert: తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు

Three days Rain Forecast for Telangana
x

Rain Alert: తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు

Highlights

Rain Alert: తెలంగాణలో మరో మూడ్రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Rain Alert: తెలంగాణలో మరో మూడ్రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గాలివానతోపాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు పడొచ్చని తెలిపారు. ఇక, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో మూడ్రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక, హైదరాబాద్‌లో రెండు మూడ్రోజులుగా మేఘావృతమై చిరు జల్లులు పడుతుండటంతో వాతావరణం కూల్‌కూల్‌గా ఉంటోంది. నగరంలో వాతావరణం చల్లబడటంతో కూల్ వెదర్‌ను హైదరాబాదీలు ఎంజాయ్ చేస్తున్నారు.

అకాల వర్షాల కారణంగా వేసవి తాపంతో అల్లాడుతోన్న ప్రజలకు ఉపశమనం లభిస్తున్నా అన్నదాతలు మాత్రం అల్లాడిపోతున్నారు. గాలివానకు పలు జిల్లాల్లో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే, మరో మూడ్రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories